YS Jagan Mohan: సదరన్ జోనల్ కౌన్సిల్ లో ఏపీ సీఎం జగన్ ఏం మాట్లాడారు?
Continues below advertisement
తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున సీఎం జగన్ మాట్లాడారు. దేశ సమగ్ర పురోగతికి కేంద్రం–రాష్ట్రాలతో పాటు, అంతర్ రాష్ట్ర సంబంధాల పరిపుష్టి చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న జగన్ ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేస్తే బాగుంటుందన్నారు. పోలవరం, రాష్ట్ర పునర్విభజన హక్కులు, విభజన చట్టం ప్రకారం నెరేవేర్చాల్సిన హామీలు, ఆస్తుల పంపకం, విద్యుత్ బకాయిలు తదితరలాపై సీఎం తన అభిప్రాయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
Continues below advertisement