TTD Neerajana Aalapana Rally : సుమన్ తో కలిసి టీటీడీ హరినామ సంకీర్తన యాత్ర | ABP Desam

జానపద, గ్రామీణ కళారూపాల పరిరక్షణకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జానపద వృత్తి కళాకారుల సంఘం, అన్నమయ్య కళాక్షేత్రం సంయుక్తంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో అన్నమయ్యకు నీరాజన ఆలాపన పేరుతో సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. హీరో సుమన్ తో కలిసి ధర్మారెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవారి పాత్ర వల్లే తనకు గుర్తింపు వచ్చిందని ర్యాలీ లో పాల్గొన్న హీరో సుమన్ తెలిపారు. జానపద కళాకారుల సంఘానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola