ముంపు ప్రాంత నిర్వాసితులకు నిత్యావసర సరుకుల పంపిణి

తిరుపతి, వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు నిత్యవసర సరుకుల పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్ ను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సిద్దం చేశారు..రామచంద్రపురం మండలంలోని రాయలచెరువుకు గండి పడడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇరవై ఐదు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జిల్లా అధికార యంత్రాంగం..అయితే ఇందులో కొన్ని గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్న ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.. వీరి కోసం బియ్యం,నూనె, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి నిత్యవసర సరుకులు అందించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola