Tirumala Free Bus Theft: తిరుమలలో మాయమైన బస్సు, ఎక్కడ దొరికిందో తెలుసా..?

తిరుమలలో ఉచిత బస్సు, అదే ధర్మరథం చోరీకి గురైంది. ఆ బస్సును నాయుడుపేట బిరదవాడ వద్ద గుర్తించారు. శ్రీవారి సాలకట్ల‌ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే.... గుర్తుతెలియని కొందరు దుండగులు ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని టీటీడీ డిపోలో ఉంచిన ఉచితబస్సును ఎత్తుకెళ్ళారు. ఇవాళ ఉదయం డిపోలో బస్సు లేదని గుర్తించిన సిబ్బంది... తిరుమలలోని అన్ని ప్రాంతాలను తనిఖీ చేసి, బస్సు చోరీకి గురైనట్టు నిర్ధరణకు వచ్చి తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.... జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలు గుర్తించారు. నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద బస్సు ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు విలువ చాలా ఖరీదైనది. దీన్ని ఎత్తుకొచ్చిన నిందితులు ఎవరో కనిపెట్టేందుకు సమీప ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola