Surya Kumar Yadav In Tirumala: తిరుమల స్వామివారిని దర్శించుకున్న SKY
తిరుమల శ్రీవారిని ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఆలయం వెలుపల అభిమానులు సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు..