Srisailam: శ్రీశైలంలో కన్నులపండువగా పుష్కరిణి హరతులు
శ్రీశైలంలో కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు. కార్తిక మొదటి సోమవారం కావటంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.