Petrol On Subsidy In Tirupati: లీటర్ 12 రూపాయలు తగ్గించి మరీ ఇస్తున్నారెందుకు..?

Continues below advertisement

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు. కానీ వంద రూపాయలకే కావాలా..? తిరుపతి జిల్లాలో ఇస్తున్నారు. దీని వెనుక ఓ కారణం ఉంది. అలాగే చిన్న మెలిక కూడా ఉంది. జిల్లాకు చెందిన డాల్లర్ గ్రూప్స్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి...  తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ లీటర్ పెట్రోల్ వంద రూపాయలకే అందించాలనుకున్నారు. చంద్రగిరి, తిరుచానూరు పెట్రోల్ బంకుల వద్ద సమీప ప్రాంతాలవారు ఇలా సబ్సిడీలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బారులు తీరారు. కానీ ఓ వాహనానికి ఐదు లీటర్లు మాత్రమే అనే నిబంధన పెట్టారు. దివాకర్ రెడ్డి ఇలా తక్కువ ధరకే పెట్రోల్ అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram