Nara Lokesh Family Tirumala: తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
నారా లోకేశ్, బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా... కుటుంబసభ్యులంతా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా... టీటీడీకి విరాళం ఇవ్వడాన్ని ఆనవాయితీగా మార్చుకున్న కుటుంబం... ఈసారి 38 లక్షల రూపాయలను అందించింది. దర్శనం అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా వడ్డించారు.