Tirupati Double Decker Bus Situation Now | వినాయకసాగర్ డంపింగ్ యార్డ్ లో పడి ఉన్న తిరుపతి డబుల్ డెక్కర్ బస్సు | ABP Desam
గతేడాది ఇదే టైమ్ లో తిరుపతిలో పెద్ద హడావిడి. అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అప్పటి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సును తీసుకువస్తున్నామంటూ ప్రచార హడావిడి ఊదరగొట్టారు. అన్నట్లుగానే బొంబాయి నుంచి అక్షరాలా 2కోట్ల 30లక్షల నిధులతో తిరుపతిలో దిగింది ఈ అందమైన డబుల్ డెక్కర్ బస్సు. పట్టుమని ఆరునెలల తిరిగిందో లేదో..ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ఈ బస్సు. తిరుపతిలోని వినాయకసాగర్ డంపింగ్ యార్డ్ లో మూడునెలలుగా పార్కింగ్ చేసి ఉంచారు.అది కూడా చెత్త కుప్పల పక్కన. ఏదైనా ప్రాజెక్టును ఊళ్లో ప్రవేశపెట్టేముందు అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చెక్ చేస్తారు ప్రజాప్రతినిధులు, అధికారులు జనరల్ గా. కానీ తిరుపతిలో ఈ డబుల్ డెక్కర్ విషయంలో అలాంటి గ్రౌండ్ వర్క్ కంటే ప్రచార హడావిడే ఎక్కువ కనిపించింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ దీన్ని అప్పటి వైసీపీ నాయకులు భారీ హడావిడి మధ్య లాంఛ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారంరోజుల పాటు ఫ్రీ గా ప్రజలందరూ ఈ బస్సు ఎక్కే అవకాశాన్ని కల్పించారు. కానీ ఆ తర్వాత అసలు సరదా మొదలైంది. పట్టుమని పది మంది కూడా ఎక్కలేదు ఈ బస్సును.