DIAL YOUR EO TTD: డయల్ యువర్ ఈవో కార్యక్రమం.. సెప్టెంబర్ 13 నుంచి టీటీడీ అగరబత్తీలు
తిరుపతి పరిపాలన భవనంలో డయల్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల నుంచి సలహాలు, సూచనలు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తీసుకున్నారు. కొవిడ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు ఉచిత టోకెన్లను మంజూరు లేదని చెప్పారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో టీటీడీ అగరబత్తీలు ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 18, 20 తేదీల్లో తిరుచానూరులో వర్చువల్ విధానంలో పవిత్రోత్సవాలు జరగనున్నట్టు వెల్లడించారు.