హిందూ ధార్మిక క్షేత్రాలను ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించిన బిజేపి
ఆంధ్రప్రదేశ్ లో అనవసరమైన రాజకీయాలకు వైసీపి ప్రభుత్వం కేంద్ర బిందువుగా మారుతుందని ఏపి బిజేపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను దేవాలయాలు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు దురదృష్టకరమని అన్నారు.