BJP Janasena Leaders Arrested In Tirupati: ఇరు పార్టీల లీడర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ బీజేపీ, జనసేన నాయకులు మహాధర్నా నిర్వహించారు. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.... ఇరు పార్టీల నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు