Tirumala Metla Pooja Significance | తిరుమల శ్రీవారి కాలినడక మార్గంలో ఈ మెట్ల పూజ ప్రత్యేకత తెలుసా..?

అనంత కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ పాపాలు అన్నీ తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకోసం స్వామి వారిని దర్శించుకోవాలని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మెట్లమార్గం ద్వారా నడుచుకుంటూ స్వామి వారికి గుడికి వెళ్తుంటారు చాలా మంది భక్తులు. ఇలా నడుచుకుని వెళ్లేవాళ్లలో ఒక్కో వీఐపీలు కూడా కనిపిస్తుంటారు. అంతటి నమ్మకం నడక ద్వారా స్వామి దర్శనం అంటే. కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే చాలా మంది నడకమార్గంలో ఉండే మెట్లకు పసుప కుంకమ బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. ఎందుకు ఇలా చేస్తారు. దీనికేమన్నా కారణం ఉందా..ఈ వీడియోలో చూద్దాం.

తిరుమల శ్రీవారి ఆలయాన్ని చేరుకోవటానికి భక్తులు ప్రధానంగా ఉపయోగించే నడకమార్గాలు రెండు. ఒకటి అలిపిరి నడకమార్గం  రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ఈ మార్గాల్లో నడుచుకుంటూ ఆలయానికి వెళ్లే భక్తులు...మెట్టు మెట్టు కు పసుపు, కుంకుమ, కర్పూరం వెలిగిస్తూ వెళ్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటీ రాయుడిగా శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ్మిని భక్తులు మొక్కుకునే మొదటి మొక్కు ఇది. ఈ సమస్య గట్టెక్కాలనే కానీ నీ కొండకు నడుచుకుంటూ మెట్టు మెట్టు కు బొట్టు పెట్టుకుంటూ వస్తానని భక్తులు మొక్కుకోవటం అనాది నుంచి వస్తున్నదే. గతంలో ఈ నడకమార్గం మాత్రమే స్వామి వారి ఆలయానికి దారి. నిత్యం వేలాదిగా భక్తులు నడిచి వెళ్లే ఈ మార్గం అపరిశుభ్రంగా ఉండటం సహజం. అందుకే ఈ దారిని శుభ్రపరిచి...హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే పసుపుతో ఈ దారిని అలకరించేవారట గతంలో. ఫలితంగా పాదరక్షలు లేకుండా నడిచి వెళ్లే వాళ్ల కాళ్లకు ఏదైనా గాయం కానీ పుండు కానీ అయినా ఈ పసుపు తగలటంతో వారి గాయాలకు ఉపమశనం కలిగేది. పైగా మంగళకరమైన పసుపు, కుంకుమ అలా మెట్లకు ఉంటే మనసుకు సైతం ఆధ్యాత్మిక చింతన చేకూరి స్వామి మీద ధ్యాసను లగ్నం చేయగలుగుతారని పూర్వం పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకువచ్చారట. క్రమేపీ అది కేవలం మొక్కుగా మిగిలిపోయినా భక్తులు స్వామిని నమ్ముకుంటే చాలు కోరిక తీరితే ఇలా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్లటం ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola