Tirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desam

Continues below advertisement

తిరుమల శ్రీవారికి సమర్పించే ప్రసాదాలు ఎన్ని ఉన్నా అందులో భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైంది లడ్డూ ప్రసాదమే. రుచి, శుచి, నాణ్యత, బరువు, స్వామివారిపై అనంతమైన భక్తిభావం అన్నీ కలగలిపి తిరుమల లడ్డూకి వచ్చేంత పవిత్రత అంతా ఇంతా కాదు. దీన్ని కచ్చితంగా ఉండేలా చూసుకునే బాధ్యత టీటీడీదే. ఇందుకు ఒక ప్రత్యేక అధికారి కూడా ఆలయంలో ఉంటారు. దిట్టంలో ఈ లడ్డూ తయారీ చేస్తారు. 5001 లడ్డూలకుగాను..165 కిలోల ఆవు నెయ్యి, 180 కిలోల శెనగపిండి, 400 కిలోల పంచదార కలుపుతారు. వీటితో పాటు 30 కిలోల జీడిపప్పు,16 కిలోల ఎండు ద్రాక్షపళ్లు, 8 కిలోల కలకండ, 4 కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు. ఈ లడ్డూ తయారీకి పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. ఏటా  200 నుంచి 250 కోట్లు టీటీడీ ఈ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తుంది. లడ్డూ బరువు దాని పరిమాణం గురించి 5ఏళ్ల కాలంలో పట్టించుకున్న అధికారులు లేరన్నదే..ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. రుచి తగ్గిందని భక్తులు ఫిర్యాదు చేసినా...ఇష్టమొచ్చినట్టు తిట్టారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram