కన్నుల పండువగా తిరుమల శ్రీవారి పెదశేషవాహన సేవ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ ధర్డ్ వేవ్ రానున్న నేపధ్యంలో ఏకాంతంగా శ్రీవారి ఆలయంలోనే స్వామి వారి వాహన సేవలను నిర్వహిస్తున్న టిటిడి.. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్ద శేషవాహనంపై భక్తులకు అనుగ్రహించారు.