Srivari Brahmostavas: ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అక్టోబర్ నెలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాబోయే రెండు మూడు నెలల్లో కోవిడ్ తీవ్ర రూపంలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే నేడు పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నమని చెప్పారు. మరో వారంలో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేక పోతున్నాయని పేర్కొన్నారు. జియో కంపెనీ వాళ్లతో సంప్రదింపులు చేశామని.. త్వరలోనే సర్వదర్శన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.