Tension In Guntur Macherla: స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వెళ్లిన బ్రహ్మారెడ్డి
గుంటూరు జిల్లా మాచర్లలో మళ్లీ కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనతో పాటు కేసులో ఉన్న అందర్నీ వెంటపెట్టుకుని స్టేషన్ కు బ్రహ్మారెడ్డి మినీ బస్సులో బయల్దేరారు. మాచర్లలో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇప్పుడు బ్రహ్మారెడ్డి వస్తుండటంతో ఏం జరుగుతుందోనని అందర్లోనూ ఉత్కంఠ నెలకొంది.