Tekkali Janasena Office : శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన కార్యాలయంపై దాడి | DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయం ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. జనసేన అధినేత పవన కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది భరించలేక దువ్వాడ వర్గీయులు జనసేన కార్యాలయం పై దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసుకున్న బీజేపీ నాయకులు జనసేన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు.