TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP Desam

హిందూపురం మున్సిపల్ పీఠాన్ని ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్డీయే కూటమికి ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓట్లతో కలిపి మొత్తం 23మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది.  ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్ గా ఎన్నిక కాగా..మంచి ముహూర్తం చూసి బాలయ్యే స్వయంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రభుత్వం మారగానే కూటమి పైన నమ్మకంతో వైసీపీ కౌన్సిలర్లు కూటమి వైపు రావటంతో మున్సిపాలిటీ పై టీడీపీ జెండా ఎగిరింది. కూటమి మద్దతుదారులను ఎన్నిక ముందు రోజు రిసార్టులకు తరలించి ఉదయం వాళ్లను ఎలక్షన్ కు తీసుకువచ్చి మున్సిపాలిటీ టీడీపీ వశమయ్యేలా చేయటంలో బాలకృష్ణదే మొత్తం డైరెక్షన్ అంతా. మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ..హిందూపురం అంటేనే నందమూరిపురం హిందూపురం మున్సిపాలిటీని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యూహాత్మక విజయాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలు, కుటుంబసభ్యులు ప్రశంసిస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola