Attack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP Desam

 పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నంబూరు శంకరరావు వచ్చారు. అమరావతి మండలం వైకుంఠపురం, పెద్దమద్దూరు, నరుకుళ్లపాడు, మునుగోడు గ్రామాల్లో పర్యటన కోసం వచ్చిన శంకరరావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతి పోలీసులు సైతం పర్యటనకు సంబంధించిన ఎలాంటి అనుమతలు కానీ ముందస్తు సమాచారం లేదని తెలిపారు. దీంతో టీడీపీ శ్రేణులు శంకరరావు వాహనాలు తరిమాయి. కర్రలతో వాహనాలను అడ్డుకుని అద్దాలపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. వరదలు వచ్చి ఇన్ని రోజులు గడిస్తే ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేద్దామంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాలంటూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పలు కేసులను నమోదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola