TDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

Continues below advertisement

    తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో బీఫ్ కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలను టీడీపీ బయట పెట్టింది. నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్ ల రిపోర్టులను టీడీపీ నేత ఆనం  వెంకట రమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిలో కేవలం 19 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లుగా గుర్తించారు.దేశంలోనే ప్రసిద్ది చెందిన  NDDB CALF ల్యాబ్ లో టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించారు. ఈ  నెయ్యిలో చేపనూనే, గొడ్డు మాంసం, పందికొవ్వు, పామాయిల్ ఉన్నట్లు తేల్చారు. తిరుమల లడ్డూలో ఇలా బీఫ్ కొవ్వును కలిపి అమ్మిన వైనంపై చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. ఆ వెంటనే ఈ అంశంపై పెను దుమారం రేగింది. టీటీడీ చైర్మన్ గా చేసిన వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేసారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ఈ మేరకు.. ఆధారాలు బయటపెట్టడం సంచలనంగా మారింది. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుత ఈవో శ్యామలరావు.. నెయ్యిని టెస్టు చేయించి.. వెంటనే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram