ఓటీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప లో టీడీపీ నేతలు నిరసన
ఓటీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీడీపీ నేతలు కడప కలెక్టరేట్ వద్దకు రాగానే గేటు తోసుకోని లోనికి చోరబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకోని ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల తోపులాట మద్య కలెక్టరేట్ లోకి ప్రవేశించిన టీడీపీ నేతలు కలెక్టర్ విజయరామరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.