TDP MLA Ayyannapatrudu Viral Video | వైరల్ అవుతున్న అయ్యన్నపాత్రుడు వీడియో

టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అందులో ఆయన ఏమన్నారో వినండి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారే తప్ప చనిపోలేదని అంటున్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఫలితాలు తర్వాత జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలో తెలిసిన వ్యక్తుల వద్ద ఈ కామెంట్స్ చేశారు. దీన్ని ఎవరో సీక్రెట్‌గా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో జగన్ మోహన్ పై అయన్న చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

అయ్యన్నపాత్రుడిని కలవడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ... వాడు ఓడిపోయాడేగాని సావలా. అపారమైన ధనబలం ఉంది. కుల బలం ఉంది. పక్క గవర్నమెంట్‌లో ఈయన మనుషులు ఉన్నారు.  అని అంటే... లెగకుండా కొట్టాలా అని అయ్యన్న రియాక్ట్ అయ్యారు. మీరు చెప్పాలు కదా.. ఓడిపోయాడు కానీ చావలేదని అది మంచి డైలాగ్‌. దీనికి ఆ పెద్దాయని రియాక్ట్ అవుతూ... డబ్బుకు అమ్ముడుపోనివాడు దేశంలో లేడు. ఆ డబ్బు పవర్‌ ఇప్పటికీ ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola