TDP Cadre Protest Against Chandrababu Arrest: కాన్వాయ్ కు అనేక చోట్ల అడ్డుపడ్డ కార్యకర్తలు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో... మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఏ-1గా పేర్కొంటూ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేసి..... ఆయనను కాన్వాయ్ ద్వారా విజయవాడకు తీసుకెళ్తుండగా... దారి మొత్తం అనేక చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలు కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. పోలీసులు అతికష్టం మీద వారందర్నీ చెదరగొట్టారు. కాన్వాయ్ ముందుకు పోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు.