టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిస్తాం
ఓటీఎస్ ను నిరసిస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ ఛార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటీఎస్ ను విరమించుకునేంత వరకు వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమం ఆగదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఎంత బలవంతం పెట్టినా పదివేల రూపాయలు చెల్లించొద్దంటూ లబ్ధిదారులకు అమరనాథ్ రెడ్డి పిలుపు నిచ్చారు. పేదలను, రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తోందన్నారు.