Swaroopananda Starts Swadharma Vahini: హిందూ ధర్మ ప్రచారానికి స్వధర్మ వాహిని ట్రస్టు ప్రారంభం
Tirumala లో శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వధర్మ వాహిని ట్రస్టు లోగోను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారానికి స్వధర్మ ట్రస్టు నిరంతరం కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మ ప్రచారానికి సరైన సంస్థలు లేవని స్వరూపానంద అన్నారు. శారదాపీఠానికి అనుబంధంగా స్వధర్మ వాహిని ట్రస్టు పనిచేస్తుందని వివరించారు.