జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి YS Jagan పై ఉన్న అక్రమాస్తుల కేసుల గురించి పూర్తి వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను Supreme Court ఆదేశించింది. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాలు గడువు విధించింది. ఇంకా కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు కూడా అందించాలని.. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్‌ల ద్వారా అందించాలని ఆదేశించింది. జగన్ పైన ఉన్న కేసుల విచారణ బాగా ఆలస్యమవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేస్తూ.. ఈ కేసు విచారణ ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, హై కోర్టుల్లో విచారణ పెండింగ్ లో ఉన్నాయని.. అదే కారణమని అడ్వకేట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మానం చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కు వాయిదా పడింది.