Stone Fight Between YSRCP TDP in Tadipatri | తాడిపత్రిలో రాళ్లతో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP Desam

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో ఓటింగ్ గురించి తెలుసుకునేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ ఉన్న సమయంలో ఇద్దరు ఒకేసారి పట్టణంలోని ఓంశాంతి నగర్ లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇద్దరు నేతలు కూడా ఒకరికొకరు ఎదురు పడటంతో మాటా మాటా పెరిగి రాళ్ల దాడి వరకు వెళ్ళింది. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola