State Purohithula Cricket tourney | అమలాపురం ఐపీఎల్ రేంజ్ లో పురోహితుల క్రికెట్ టోర్నీ | ABP Desam
నిత్యం వేద మంత్రాలు, పూజలతో ఆధాత్మిక జీవితం గడిపే పురోహితులు క్రికెట్ బ్యాట్, బాల్ చేతపట్టి రంగంలోకి దిగి మరీ తెగ చెలరేగిపోయారు.. పూజలు, పునస్కారాలే కాదు సుమీ.. మేమూ క్రికెట్ ఆడగలం అంటూ తెగ సందడి చేశారు.. రాష్ట్ర స్థాయి పురోహితుల క్రీడా పోటీలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్నాయి.. ఈపోటీలకు రాష్ట్రంలోని నలు మూలల నుంచి పురోహితులు తరలివచ్చి క్రికెట్ ఆడుతున్నారు. వీరిలో ప్రసిద్ధ అన్నవరం, సింహాచలం తదితర పుణ్యక్షేత్రాల్లో పురోహితులుగా పనిచేస్తున్నవారు కూడా వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇక పురోహిత వృత్తిలో కొనసాగుతున్న యువకులే కాదు 50 ఏళ్లు పైబడిన పురోహితులు కూడా క్రికెట్‌బ్యాట్ చేతపట్టి ఆడుతుండడం ఆకట్టుకుంటుంది.. సాంప్రదాయల పంచెతో బాల్ కోసం పరుగులు పెట్టడం, బౌలింగ్ చేయడం ఇలా అన్నీఅలరిస్తున్నాయి.. కామెంట్రీ కూడా అచ్చతెలుగులోనే పైగా వేదమంత్రాలు స్టైల్లో చెప్పుతుండడం కూడా కొంత భిన్నంగా కనిపిస్తోంది.. సుదూర ప్రాంతాలనుంచి వస్తున్న పురోహిత క్రీడాకారులకు అమలాపురం పురోహిత సంఘ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. పురోహితుల్లో క్రీడా స్ఫూర్తిని రగిలించడంతోపాటు శారీరక ధారుఢ్యం పెంపొందించేందుకు, మానసిక ఉల్లాసం కోసం ప్రతీ ఏటా ఈ రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..