Srisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్ | ABP Desam
మన తెలుగు రాష్ట్రలో ఉండే హై వేస్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్. పండుగలు వస్తే ఇక చేపోదు అనుకోండి. ఈ హైవేతోపాటు అతి ముఖ్యమైనది హైదరాబాద్ శ్రీశైలం హైవే కూడా. సమయం ఏదైనాకానీ ఈ రెండు హైవేలు ఎప్పుడు బిజీగానే ఉంటాయి. శ్రీశైలం వెళ్లే వాలే కాకుండా రాయలసీమ, నంద్యాల వెళ్లే వాళ్లు కూడా ఈ హైదరాబాద్ శ్రీశైలం హై వేని యూస్ చేస్తారు.
125 కిలో మీటర్లు ఉన్న ఈ జాతీయ రహదారి అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్తుంది. దాదాపు 62కిలో మీటర్ల దూరం వరకు కేవలం రెండు లైన్లు మాత్రమే ఉంటాయి. ఘాట్లు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక ఈ రోడ్డులో టర్నింగ్ పాయింట్స్ కూడా ఎక్కువే. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రోడ్లపైకి వచ్చిన అడవి జంతువులు టర్నింగ్ పాయింట్స్ దెగ్గర ఆక్సిడెంట్ కి గురవుతున్నాయి. ఈ హై వే నల్లమల్ల అడవిలో నుండి వెళ్తుంది. రాత్రి అయితే అడవిలోని జంతువులూ బయటకి వస్తాయి అని రాకపోకలు కూడా ఆపేస్తారు. ఫ్యూచర్ లో ఈ హై వేపై ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని అంచనా వేసిన గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది.
ఈ ఇబ్బందులని చెక్ పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే 62 కిలోమీటర్ల అదికూడా దట్టమైన అడవిలో 30 అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కుంచోనిమూల, దుర్వాసుల చెరువు ఫరహాబాద్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం వరకు ఈ కారిడార్ వెళ్తుంది.
ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెనను కూడా నిర్మించబోతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరమవుతుంది. అడవిలో జంతువులకు ఇబ్బంది లేకుండా, చెట్లను తొలగించకుండా భూసేకరణ చేద్దామని అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో హైలైట్ గా నిలిచిన పాయింట్ ఏంటంటే ... ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం అవబోతున్నప్పటికీ వృక్ష సంపద మాత్రం దెబ్బ తినట్లేదు.
ప్రస్తుతం రాత్రి వేళల్లో ఈ రూట్ లో వెకిల్స్ ని అల్లౌ చేయరు. ఈ ఎలివేటెడ్ అందుబాటులోకి వస్తే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారు. వాహనాలు 24 గంటలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే శ్రీశైలం రవాణా, పర్యాటక పరంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి, దిగేలా ఎలాంటి వసతులు కలిపించొద్దని అటవీశాఖ సూచించింది. జంతువులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాత్రివేళ తక్కువ లైటింగ్ పెట్టాలని, నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. మోతంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకి కలిసివస్తుంది.