స్కూల్లో టపాసులు కాల్చిందని విద్యార్ధిని ని రూమ్ లో బంధించిన ప్రిన్సిపాల్.

శ్రీ‌కాకుళం జిల్లా , పొందూరు మండ‌లం , వావిల‌ప‌ల్లిపేట మోడ‌ల్ స్కూల్ ప్రిన్సిపాల్ తిల‌కం, స్కూల్లో టపాసులు కాల్చిందని ఇంట‌ర్ విద్యార్ధినిపై త‌న పైచాచికాన్ని ప్ర‌ద‌ర్శించి రెండు గంట‌ల‌పాటు ఒక రూంలో బందించి చితకబాది మాన‌వ మృగంగా మారాడు.ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా అష్ట‌క‌ష్టాలు ప‌డిన‌ప్ప‌టికీ తోటి విద్యార్ధుల ద్వారా బ‌య‌ట‌ప‌డ‌డంతో అక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న‌ను చూచి తోటి విద్యార్ధులు త‌మ త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించ‌గా ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకొని గ‌దిలో ఉన్న త‌మ పాప‌ను తీసుకొని పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.స‌మాచారం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌కు వెల్లి తోటి విద్యార్ధుల‌ను విష‌యం అడిగి తెలుసుకున్నారు.ఇక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న భాదాక‌ర‌మ‌ని ప్రిన్సిపాల్‌పై కేసు న‌మోదు చేసి ధ‌ర్యాప్తుచేస్తున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola