తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో
Srikakulam Man sleeps on Power Lines | ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగపురం గ్రామంలో మద్యం మత్తులో యజ్జల వెంకన్న అనే యువకుడు హల్చల్ చేశాడు. తన తల్లికి పెన్షన్ అందడంతో.. డిసెంబర్ 31 సందర్భంగా తనకు డబ్బులు ఇవ్వాలని యువకుడు వెంకన్న తల్లిని కోరాడు. తాగేందుకు తాను డబ్బులు ఇవ్వనని తల్లి చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడు అలిగి.. కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. వెంటనే స్పందించిన గ్రామస్తులు అతను స్తంభం ఎక్కేముందే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ డీపీ స్విచ్ ను ఆఫ్ చేసేశారు. దీంతో అతనికి ముప్పు తప్పింది. కాసేపటికి అతనికి సర్దిచెప్పి గ్రామస్థులు కిందికి దింపారు.