Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP Desam

Continues below advertisement

 మన దేశంలో రూపీ అనేది కరెన్సీ.  తెలుగులో  రూపాయి అంటాం. ఇప్పుడు ఈ స్టోరీ ఏదో రూపాయి విలువ పడిపోయిందనో డాలర్ విలువ పెరిగిందనో కాదు..ఓ గ్రామం కథ చెబుదామని ఈ స్టోరీ. ఎందుకంటే ఈ గ్రామం పేరే రూపాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఓ గిరిజన గ్రామం పేరు రూపాయి.  తరతరాల నుంచి ఆ ఆదివాసీ గ్రామం పేరు అది. గూగుల్ ని అడిగినా చెప్పేది ఏంటంటే ఇక్కడ నివసించేది అంతా గిరిపుత్రులే. సీతంపేట ఐటీడీఏ, మండలంలో పనిచేసి అధికారులు ఎవరు కొత్తగా జాయిన్ అయినా ఈ గ్రామానికి ఒక్క సారి చూసి రావడం ఆనవాయితీగా మారింది. ఈ గ్రామానికి ఉన్న రూపాయి అనే పేరే ఈ పల్లెకు అంత క్రేజ్ తీసుకువచ్చింది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి పేరుండేది కాదంటారు. చుట్టు పక్కల గ్రామల కంటే ఈ గ్రామం అప్పట్లో ఆర్థికంగా స్థితిమంతంగా ఉండేదట. ఈ గ్రామానికి సమీపంలో మరో గ్రామంలో మేకలుండేవట. ఈ గ్రామస్తులు రూపాయి ఇచ్చి ఆ మేకలను కొనుగోలు చేసేవారట. అప్పట్లో రూపాయి బాగా విలువ ఉండటంతో మేకకు మంచి రేటు వస్తుండటంతో...ఈ గ్రామం పేరు రూపాయి గ్రామంగా మారిపోయిందని ఇక్కడ వినిపించే కథనం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram