Sri Simhadri Appanna Giri Pradakshina | వైభవంగా అప్పన్నగిరి ప్రదక్షిణ

Continues below advertisement

సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా మొదలయ్యింది. గిరి ప్రదక్షిణను లాంచనంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సింహాచలం గోవింద నామ స్మరణతో మారుమోగుతోంది. 

గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలిపావంచా దగ్గర ప్రారంభమై .. అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, NAD జంక్షన్‌, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా సింహాచలం అప్పన్న ఆలయం వరకు కొనసాగుతుంది. గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నస్వామివారికి తుది విడత చందనోత్సవం జరుగుతుంది. 

గిరి ప్రదక్షిణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా పోలీసు అధికారులు గిరి ప్రదక్షిణను పర్యవేక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola