Somireddy vs Kakani Bangalore Rave party | రేవ్ పార్టీ బెంగుళూరులో...పొలిటికల్ వార్ నెల్లూరులో | ABP

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్టిక్కరు కారు ఉండటంతో నెల్లూరు పాలిటిక్స్ లో హీట్ పెరిగింది. రేవ్ పార్టీని పెట్టింది కాకాణి గోవర్థన్ రెడ్డినేంటూ టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలు చేస్తే..కాకాణి సైతం ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. తనపైన సోమిరెడ్డి అవాకులు చవాకులు పేల్చుతున్నారని సోమిరెడ్డి ని తన ప్రత్యర్థి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు గా ఉందన్నారు మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి. చేతనైతే తనకు సంబంధించిన వాళ్లు , పార్టీ నిర్వాహకుడితో గాని తనకు సంబంధం ఉందని నిరూపించాలన్నారు. జిరాక్స్ కాపీ ని కార్ కి అతికించు కుంటే తన తప్పు ఎలా ఉందని ప్రశ్నించిన కాకాని గోవర్థన్ రెడ్డి. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ కి తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని తెల్చి చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలపై ఘూటుగా కౌంటర్లు ఇస్తూనే ప్రజలకు ఆరోపణలపై క్లారిటీ కూడా ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola