తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరా

తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సిట్‌ సభ్యులు ఆలయంలో విచారణ చేపట్టారు. లడ్డు తయారు చేసే బూంది పోటుకి వెళ్లారు. లడ్డు ఎలా తయారు చేస్తున్నారో దగ్గరుండి పరిశీలించారు. వీటితో పాటు నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్‌లనూ పరిశీలించారు. నెయ్యిని ఎలా వాడుతున్నారో ఆరా తీశారు. దాదాపు మూడు రోజులుగా తిరుమలలో తనిఖీలు కొనసాగిస్తోంది..సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని బృందం. టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లనూ దర్యాప్తు చేపట్టింది. గోడౌన్‌లనూ పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఇప్పటికే సిట్‌ ప్రకటించింది. కల్తీ నెయ్యిని పంపారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న AR డెయిరీ సంస్థపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే...ఈ కంపెనీ ఎండీ తమపై వస్తున్న ఆరోపణలని ఖండిస్తూ హైకోర్టుని ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీపై సెకండ్ ఒపీనియన్ ఏదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవుళ్లని రాజకీయాల కోసం వాడుకోవద్దని మందలించింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola