Singirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP
సాధారణంగా విష్ణమూర్తి అవతారమూర్తికి అమ్మవార్లుగా శ్రీదేవి భూదేవి ఉండటం మనకందరికీ తెలుసు. కానీ ముగ్గురు అమ్మవార్లతో ఉండే ఉగ్రనారసింహుడి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా..పదండి తెలుసుకుందాం.తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనానికి సమీపంలో ఉంటుంది నగిలేరు గ్రామం. ఈ ప్రాంతాన్నే సింగిరికోన అని కూడా పిలుస్తారు. తిరుపతి నుంచి 47కిలోమీటర్ల దూరంలో..నారాయణవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ సింగిరి కోన ఆలయం చాలా పురాతనమైనది...మహిమాన్వితమైనది కూడా. సింగిరికోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ కనిపించే చిన్న కొండ పైన ఉంది. కొండ కింద చిన్నపాటి జలపాతం దాని సమీపంలోని కోనేరు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నీటినే ఆలయం, ఇతర అవసరాలకు వినియోగిస్తుంటారు. ఇక్కడ నరసింహస్వామి స్వయంభువుగా వెలసినట్లు చెబుతారు. ఇక్కడ గర్భగుడిలో స్వామి వారి కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. మూలవిరాట్ నోరు తెరుచుకుని ఉన్నట్లుగా దర్శనమిస్తుంటుంది. దీనికి స్థానికంగా ఓ కథ కూడా చెబుతుంటారు. స్వామివారి వేటకు వచ్చి కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని..కళ్లు తెరిచి చూసేసరికి తెల్లవారిపోయిందని..అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యపోగానే అలాగే శిలగా మారిపోయారని ఓ కథనం ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే స్వామి వారి రూపం ఆశ్చర్య చకితులైనట్లుగానే కనిపిస్తూనే ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంటుంది