Shyamala Rao Take Charges TTD EO | టీటీడీ ఈవో గా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు | ABP Desam

Continues below advertisement

TTD EO Shyamala Rao Takes Charge | తిరుమల: టీటీడీ ఈవోగా జే. శ్యామల రావు బాధ్యతలు స్వీకరించారు. పవిత్ర తిరుమల దేవాలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఈవో (TTD EO)గా ఉన్న ధర్మారెడ్డిపై కూటమి ప్రభుత్వం ఇటీవల వేటు వేసింది. వైసీపీ ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ధర్మారెడ్డిని తప్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO)గా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (AP CS) నీరభ్ కుమార్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు.

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామల రావు (1997 ఐఏఎస్ బ్యాచ్) తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తిరుమల హిందువుల (Tirumala Temple)కు పవిత్ర పుణ్యక్షేత్రం అని, ప్రతిరోజూ దేశంలోని నలుమూలలతో పాటు ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రతి రోజూ 70 నుంచి 80 వేల వరకు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అందుకే ఈ పవిత్ర తిరుమల దేవాలయానికి ఈవోగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవుడు ఆశీస్సులతో టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై ఎంతో నమ్మకంతో టీటీడీకి ఈవోగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram