Sajjala Ramakrishna reddy : వైఎస్ వివేకా హత్యకేసులో దోషులకు శిక్ష పడాల్సిందే..! | DNN | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీబీఐ కేసును తెలంగాణ కు బదిలీ చేయటంపై మాట్లాడిన ఆయన...కేసు బదిలీ అయితే భయపడాల్సింది దోషులే అన్నారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ రోజు వరకూ అమరావతే రాజధాని అని ఆ విషయాన్నే సుప్రీంకోర్టులో చెప్పామన్నారు. మూడు రాజధానులపై మరోసారి బలమైన చట్టంతో ముందుకు వస్తామన్నారు.