Robotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

Continues below advertisement

Robotic Life Jacket SDRF |

ఇది మనుషుల ప్రాణాలు కాపాడే రోబో..! ఎలాగంటే..వరద ప్రవాహంలో ఎవరైనా అనుకోకుండా పడిపోతే వాళ్లు కొట్టుకుపోతుంటారు కదా. అలాంటి వాళ్ల దగ్గరకి ఈ రోబోను పంపించాం అనుకోండి. ఈ రోబోను పట్టుకుంటే చాలు... అదే ఆటోమేటిక్ గా మనకు గట్టు దగ్గరకి చేర్చతుంది. భలే ఉంది కదా ఈ ఐడియా..! ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో తమ్మిలేరు వద్ద SDRF బృందాలు ఈ రోబో డెమో నిర్వహించారు. విజయవాడలో వరదలు రావడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డీ ఆర్ఎఫ్ బృందాలు ఏపీకి వచ్చాయి. ఐతే.. ఈసారి సంప్రదాయంగా సహాయక చర్యలు చేపడుతూనే టెక్నాలజీని భాగం చేస్తున్నారు. అందులో భాగంగా డ్రోన్లతో ఆహారం, ఇతర వస్తువులు అందజేస్తారు. ఇప్పుడు...వరదల్లో ఎవరైనా పడిపోతే రోబో సాయంతో వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ప్రవాహంలో పడిపోతే వెంటనే ఈ మెషీన్ అక్కడ ఉండదు కదా అనే డౌట్ మీకు రావొచ్చు.  యస్... అది నిజమే కానీ. ప్రవాహంలో కొట్టుకుపోతూ చెట్టునో , పుట్టనో పట్టుకుని సాయం కోసం ఎదురూచూస్తున్న వారిని రక్షించవచ్చు కదా..! అదే మెయిన్ ఉద్దేశం. వీలైనంత మేర ప్రాణ నష్టం తగ్గించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యమని sdrf బృందాలు చెబుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram