Rayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP Desam
పన్నేండేళ్ల పోరాట ఫలితం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహిస్తోన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని... మొన్నటి సాధారణ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశామని.. అందుకే ఈ సభకు జయకేతనం అని పేరుపెట్టినట్లు జనసేన పార్టీ మహిళా నాయకురాలు రాయపాటి ఆరుణ అన్నారు. జనసేన పార్టీ కార్యదర్శి నాగబాబుకు శాసన మండలి సభ్యుడు పదవి ఇవ్వటం వెనుక పార్టీ నిర్ణయం ఏంటీ...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసైనికుల్లో దూకుడు ఎందుకు తగ్గిందో కూడా చెప్పారు రాయపాటి అరుణ. పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన సభ ఎలా గాజువాక, భీమవరం ఓటర్లలో బాధకు కారణమవుతుందో లాజికల్ గా చెప్పిన రాయపాటి అరుణ..వైసీపీ నేతలు దారుణ ఓటమిని చూసినా కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. మొత్తం గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభా ప్రాంగణం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణతో ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్ ఫేస్ టూ ఫేస్.