రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

Continues below advertisement

తిరుపతి సమీపంలోని రాయలచెరువుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో కట్టించిన ఈ చెరువు ద్వారా రామచంద్రాపురం మండలంలో 16 గ్రామాలకు సాగు, తాగునీటిని అందించే వీలుంది. అయినా గడచిన ఐదేళ్లలో ఈ చెరువు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. చెరువు నిండా పేరుకుపోయిన గుర్రపు డెక్క..మురికినీళ్లతో మారిపోయింది. చెరువు చుట్టు పక్కల పరిసరాలన్నీ  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. చెరువు దుస్థితిపై ఏబీపీదేశం కథనాలను కూడా ప్రసారం చేసింది. అయితే ఇదంతా గతం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికుడైన రవినాయుడు శాప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఫలితంగా చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. చెరువులో ఉన్న చెత్తను తొలగించారు. చెరువు కట్ట పై పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. ఇప్పటివరకు విశాఖపట్నం కు పరిమితమైన డ్రాగన్ బోట్ పోటీలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కు తీసుకొచ్చారు.  నేషనల్ డ్రాగన్ ఛాంపియన్ పిప్ పోటీలు 2025 జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు డిల్లీ వేదికగా సీనియర్స్, 11 నుంచి 16 వరకు కేరళలో జూనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరపున పాల్గొనే వారికి రాయలచెరువులో పోటీలు నిర్వహించాలని శాప్ నిర్ణయించింది. అందుకే అనుగుణంగా  కెనాయింగ్, కయాకింగ్ పోటీలకు రాయలచెరువులో ఏర్పాట్లు చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram