80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యం

Continues below advertisement

ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 80 వేల ఏళ్ల తరవాత అరుదైన తోకచుక్క మెరిసింది. అక్టోబర్ మొదటి వారంలో భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపించింది. అక్టోబర్ 12-24 మధ్య కాలంలో భూమికి అత్యంత దగ్గరగా రానుంది. లద్దాఖ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్‌లు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు షేర్ చేశారు. ఏపీలోనూ తిరుపతిలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ ఫొటోలు తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

లద్దాఖ్‌లోని గోంగ్మా లా వద్ద ఈ తోకచుక్క కనిపించింది. ఆస్ట్రో ఫోటోగ్రఫీలో ఆరితేరిన ఎక్స్‌పర్ట్స్ టీమ్‌ ఆ ప్రాంతానికి వెళ్లి ఈ తోక చుక్కని ఫొటోలు తీసింది. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో టీమ్ చాలా ఇబ్బందులు పడింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయినా...ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆ తోక చుక్క ఫొటోలు తీశారు. ఇక తమిళనాడులో మహాబలిపురం వద్ద ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇలా పలు ప్రాంతాల్లో ఫొటో గ్రాఫర్‌లు ఈ ఫొటోలు తీసి షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram