Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP Desam

Continues below advertisement

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి దుర్గమ్మ ఆలయానికి వెళ్లిన చరణ్ తన కొత్త సినిమా RC16 స్క్రిప్టుకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కనకదుర్గ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు ఇంకా RC 16 డైరెక్టర్ అయిన బుచ్చిబాబుతో కలిసి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన తన కొత్త సినిమా RC16 స్క్రిప్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మ ఆశీర్వాదం కోరారు. ఈ సందర్బంగా చరణ్ వినయంతో పూజల్లో పాల్గొన్నారు. దుర్గమ్మ ఆలయానికి తర్వాత, రామ్ చరణ్ కడపలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం అమీన్ పీర్ దర్గాకి కూడా వెళ్లారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సినిమా విజయవంతం కావాలని ప్రార్థించారు. రామ్ చరణ్ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తూ, తన అభిమానులను అలరిస్తున్నారు.

 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram