Rajanagaram EX MLA Jakkampudi Raja Interview | ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంది అందుకే | ABP Desam

ఏపీ పేప‌ర్ మిల్లు  యాజ‌మాన్యం కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించకుండా కాల‌యాప‌న చేస్తోన్నందుకే ఆమ‌రణ నిరాహార దీక్షకు పూనుకున్నాన‌ని మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అన్నారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో కార్మికుల స‌మ‌స్య‌ల‌కోసం దీక్ష‌కు ప్ర‌య‌త్నిస్తే త‌న‌ను హౌస్ అరెస్ట్ చేశార‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా చేస్తున్న ఏ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌గనివ్వ‌కుండా ప్రభుత్వం అడ్డ‌కుంటుంద‌న్నారు. సంప‌ద సృష్టిస్తాన‌న్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్నారు. కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం జ‌రిగేదాకా త‌న ఉద్య‌మం వీడేది లేద‌న్నారు. తాను శాస‌న స‌భ్యునిగా ఉన్న స‌మ‌యంలో కూడా పేప‌ర్ మిల్లు కార్మికుల స‌మ‌స్య‌ల కోసం పోరాటం చేశాన‌ని, ప్ర‌భుత్వంపై కూడా ఒత్తిడి చేసి కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం చూపాన‌న్నారు. లిక్క‌ర్ స్కాం వ్య‌వ‌హారంలో ఒక ఎంపీకు సంబంధం ఎందుకు ఉంటుంద‌న్నారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న వెంట ఉండే నాయ‌కుల‌ను రాజ‌కీయంగా అణిచివేయాల‌న్న ఉద్దేశ్యంతో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కురాలిగా ఉన్న సోనియా గాంధీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఏమీ చేయ‌లేక‌పోయార‌ని, ఎంత‌గా అణ‌గ దొక్కాలనే చూస్తే అంత క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తార‌న్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తుంద‌న్నారు..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola