బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యానాం రాజీవ్‌గాంధీ రివర్ బీచ్ లో అదే.. ఫెర్రీ రోడ్ మార్గంలో జీసస్ స్టాట్యూను చూశారా.. బ్రెజిల్ రాజధాని రియో లో ఉన్న జీసస్ విగ్రహాన్ని పోలి నిర్మించిన ఈ స్టాట్యూను మౌంట్ ఆఫ్ మెర్సీ అనే పేరుతో 2009లో పుదుచ్చేరి ప్రభుత్వం కార్పోరేట్ సంస్థ(రిలయన్స్) సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసింది.. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మౌంట్ ఆఫ్ మెర్సీ స్టాట్యూ మొదటి అంతస్తులో మేరీ మాత ఆలయం కూడా ఉంటుంది.. ఇందులో క్రీస్తు గురించి విశేషాల నమూనాలు ఉంటాయి.. ఇది ఆదివారం మాత్రమే తెరిచి ఉంచుతారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి చూస్తే నిలువెత్తు జీసస్ విగ్రహం కనిపిస్తుంది.. ఈ మౌంట్‌ఆఫ్ మెర్సీ మొత్తం నిర్మాణం ఎత్తు 62 అడుగుల్లో నిర్మించగా 25 అడుగుల ఎత్తులో మౌంట్‌ను పోలిన నిర్మాణం చేపట్టారు. జీసస్ విగ్రహం 37 అడుగుల ఎత్తులో ఉంటుంది.. ఇక క్రింది భాగంలో అయితే గుహలా ఉంటుంది.. ఇక్కడ పర్యాటకులు కూర్చునేలా ఏర్పాట్లు ఉంటాయి.. ఒకవైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గౌతమీనది సోయగం.. మరో పక్క 214 నేషనల్ హైవేను కలుపుతూ నదిపై నిర్మించిన బాలయోగి వారధిపై రాకపోకలు సాగించే వాహనాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి..