Balakrishna In Rajahmundry Airport: చంద్రబాబుతో ములాఖత్ కోసం వచ్చిన బాలకృష్ణ
హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుతో ఇవాళ బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి బాలకృష్ణ జైలుకు వెళ్లనున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.