అద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీ
రాజమహేంద్రవరంలో అద్దె కంప్యూటర్తో ప్రారంభించిన ఈ యువకుడి ప్రయాణం ఇప్పుడు రూ.100 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. శ్రీకాకుళానికి చెందిన చింత అనిల్.. రాజమహేంద్రవరంలోనే ఎంటెక్ పూర్తి చేసి.. స్టార్టప్ ను ప్రారంభించారు. చేతిలో చిల్లి గవ్వలేక ఒక కంప్యూటర్ను అద్దెకి తీసుకుని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేశారు. ఇలా మొదలైన ఆయన ప్రయాణం.. ఏకంగా సొంత భవనం నిర్మించడంతో పాటు.. అక్కడే 100 మందికి ఉద్యోగాలిచ్చి.. ఆ కంపెనీని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇచ్చి.. వారిని నిపుణులుగా తయారు చేస్తున్నారు. వారి ప్రతిభ ఆధారంగా తన దగ్గరే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్న అనిల్.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో యాప్ లను రూపకల్పన చేసి ప్రభుత్వ మెప్పును పొందారు. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి కష్టపడి లక్ష్యం కోసం పనిచేస్తే ఏదైనా సాధ్యమని నిరూపించారు అనిల్. రాజమహేంద్రవరంలోని అమరావతి సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చింత అనిల్ తో abp దేశం ఫేస్ టూ ఫేస్