మూడేళ్లుగా అన్నార్తులకు ఆహార పంపిణీ చేస్తున్న గోదావరి కుర్రోడు
Continues below advertisement
అతనో చిరు వ్యాపారి.. చిన్న సెల్‌ఫోన్ రిపేర్ షాపు నిర్వహిస్తుంటాడు.. ఆదాయం వచ్చేది అంతంతమాత్రమే అయినా అందులోనుంచే అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడు. తన స్తోమతకు తగ్గట్టు తన బైక్‌కు రెండు బ్యాగులు తగిలించుకుని అందులో ఆహారపొట్లాలను పెట్టుకొని పట్టణమంతా గిర్రున తిరిగి పట్టెడన్నంకోసం ఎదురు చూస్తున్నవారికి ఆ పొట్లాలను అందించి వెళ్లిపోతుంటాడు.. ఇది ఏదో తన అభిమాన హీరో పుట్టినరోజునో లేక తన పుట్టినరోజునో ఏదో ఒకటి రెండు నెలల నుంచో కాదు.. దాదాపు మూడేళ్ల క్రితం నుంచి క్రమం తప్పకుండా ప్రతీ శుక్రవారం నా అనేవారు లేక పట్టెడన్నంకోసం ఎదురు చూస్తున్నవారికి ఆహారాన్ని అందించి తన సేవా నిరతిని చాటుకుంటున్నాడో యువకుడు..
Continues below advertisement