Rahul Gandhi: రాహుల్ గాంధీ ఏపీలో ఏ లీడర్లపై గురి పెట్టారు?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచి రాహుల్ గాంధీ గేరు మార్చారు. విపక్షాలతో విందు సమావేశాలు, రాష్ట్రాలవారీ వ్యూహాలు మొదలయ్యాయి. యూపీ లీడర్లతో మాట్లాడారంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయ్ అనుకోవచ్చు. రాహుల్ ఏపీ లీడర్లతో కూడా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాజీ సీఎం కిరణ్‌తో పాటు 7 , 8 మంది ముఖ్య నేతలతో రాహుల్ సమావేశమయ్యాక ఇపుడు ఇంకో కొత్త టాక్ వినిపిస్తోంది. ఏపీలో కొందరు లీడర్లపై రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టారని, వారిని ఢిల్లీకి పిలుస్తారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన, జగన్ పార్టీ కారణంగా కాంగ్రెస్ చతికిల పడింది. కానీ ఇపుడు జగన్ పార్టీ పై గ్రౌండ్ లెవెల్‌లో వ్యతిరేకత పెరిగిపోతోందని కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ళ పాటు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీపై ప్రజావ్యతిరేకతతో కాంగ్రెస్ పుంజుకుంటుందనేది వాళ్ళ లెక్క. కేంద్రంలో కాంగ్రెస్ బలపడిన ప్రతిసారి తెలుగు నేతల మీద ఆ ప్రభావం ఉందని 2004, 2009లో గెలవటానికి అది కూడా ఓ కారణమని వాళ్ళ ఆలోచన. అందుకే జగన్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ సానుభూతి ఓట్లని కొంతవరకైనా తిరిగి రాబట్టుకోవచ్చనేది వారి వ్యూహం.